విజయ్ దేవరకొండతో జతకట్టనున్న సాయి పల్లవి ?

Sai Pallavi Devarakonda
‘అర్జున్ రెడ్డి’ చిత్రం తరువాత వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈయన తాజాగా’ మళ్ళీ మళ్ళీ ఇది రాని’ రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించనున్నాడని సమాచారం. క్రాంతి చెప్పిన స్టోరీ విజయ్ కి నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన సాయి పల్లవిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం సాయి పల్లవి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది . తమిళంలో ధనుష్ సరసన ‘మారి 2’ అలాగే సూర్య తో ‘ఎన్ జి కె’ తెలుగులో శర్వానంద్ కి జోడిగా’ పడి పడి లేచే మనుసు’ చిత్రాల్లో నటిస్తుంది. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Exit mobile version