మహేష్ సినిమా కోసం ముసుగేసుకుని వెళ్లిన సాయి పల్లవి !

Published on May 16, 2022 3:00 pm IST

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి గొప్ప నటే కాదు, గొప్ప వ్యక్తి కూడా. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని.. సినిమా రంగంలో సాయి పల్లవిలా ఉండటం చాలా అరుదు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే, ఆ టాక్ కి తగ్గట్టుగానే సాయి పల్లవి కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను నెటిజన్లను ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే, తాజాగా సాయి పల్లవి చేసిన ఓ పని ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సర్కారు వారి పాట. ఈ సినిమా రాక కోసం అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐతే, సాయి పల్లవి కూడా ఎదురుచూసినట్టు ఉంది. అందుకే, ఈ సినిమా చూసేందుకు సాయిపల్లవి ముసుగేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లింది.

హైదరాబద్ లోని పీవీఆర్‌ ఆర్‌కే సినీప్లెక్స్‌లో సాయి పల్లవి ఈ సినిమా చూసింది. సినిమా చూసి వచ్చేటప్పుడు పేస్ కి మాస్క్‌ ధరించి ఎవరూ గుర్తు పట్టకుండా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు థియేటర్‌ నుంచి బయటకు వచ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సంబంధిత సమాచారం :