వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన సాయి పల్లవి “గార్గి”

Published on Jan 20, 2023 8:00 pm IST


లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి గత చిత్రం గార్గి అనేక మంది విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయ్యింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం స్టార్ మాలో జనవరి 26, 2023న ఉదయం 8:30 గంటలకు ప్రసారం కానుంది. గార్గిలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, R.S.శివాజీ, కలైమామణి శరవణన్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యలక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :