ఈ నెలలోనే విడుదలకానున్న సాయి పల్లవి సినిమా!


‘ఫిదా’ చిత్రంతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. చాలా మంది నిర్మాతలు. దర్శకులు మంచి మంచి ఆఫర్లతో ఆమెను సంప్రదిస్తున్నారు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఇతర భాషల్లో ఆమె నటించిన సినిమాల్ని తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అలా రాబోతున్న చిత్రమే ‘హేయ్ పిల్లగాడ’.

‘ఫిదా’ సినిమాలో సూపర్ హిట్ పాట ‘హేయ్ పిల్లగాడ’ నుండి ఈ టైటిల్ ను తీసుకున్నారు. మలయాళంలో సాయి పల్లవి, దుల్కర్ సల్మాన్ కలిసి నటించిన ‘కాళి’ సినిమాకు అనువాదమిది. అన్ని డబ్బింగ్ పనుల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయనున్నారు. సమీర్ తాహిర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏ.డి.వి కృష్ణ స్వామి సమర్పిస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి ప్రస్తుతం నాని సరసన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, నాగ శౌర్య సరసన ‘కణం’ వంటి సినిమాల్ని చేస్తోంది.