సాయి పల్లవి మలయాళ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది !

పడి పడి లేచె మనసు తరువాత ప్రస్తుతం మలయాళం లో సినిమాలు చేస్తుంది క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె మలయాళ భాషలో ‘అతిరన్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈచిత్రంలో స్టార్ హీరో ఫహద్ ఫజిల్ , సాయి పల్లవి కి జోడీగా నటిస్తున్నాడు.

రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక సాయి పల్లవి కి తెలుగు తోపాటు తమిళం లోనూ క్రేజ్ ఉండండంతో ఈ చిత్రాన్ని మలయాళం తోపాటు తెలుగు , తమిళ భాషల్లో విడుదలచేస్తుంది చిత్ర నిర్మాణ సంస్థ సెంచరీ ఫిలిమ్స్. ఏప్రిల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

Exit mobile version