సాయిరాం శంకర్ “రీసౌండ్” ఫస్ట్ లుక్ విడుదల!

Published on Sep 13, 2021 1:10 pm IST


సాయిరాం శంకర్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. రిసౌండ్ అంటూ తన కొత్త చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేయడం మాత్రమే కాకుండా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరింత మాస్ గా ఉంది. ఈ చిత్రం లో రాశి సింగ్ కీలక పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ మురళి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ రెడ్డి మరియు అయ్యప్ప రాజు రాజ రెడ్డి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి స్వీకర్ ఆగస్తీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :