పవన్ చిత్రం కోసం సాయి తేజ్ బల్క్ డేట్స్?

Published on Jul 12, 2022 12:40 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. తన లిస్ట్ లో ఇప్పటికే హారి హర వీర మల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల తమిళం లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం ను రీమేక్ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన షూటింగ్ సైతం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇచ్చాడని, మూడు నెలల షూటింగ్ కోసం అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ చాలా పెద్ద క్యామియోలో నటిస్తున్నాడు. ఫాంటసీ యాంగిల్‌లో సాగే ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :