“ఆదిపురుష్” లో తన పాత్ర ముగించేసిన రావణ్!

Published on Oct 9, 2021 11:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సినిమాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మైథలాజికల్ డ్రామా ఇది. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ అక్టోబర్ నెలతోనే మొత్తం షూట్ ని కంప్లీట్ చేసేసుకోనున్న ఈ భారీ సినిమాపై మేకర్స్ ఇప్పుడు ఓ లేటెస్ట్ అప్డేట్ ని ఇచ్చారు.

ఈ సినిమాలో రావణ్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు తన పాత్రని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే తన షూట్ కంప్లీట్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ సైఫ్ తో కేక్ కూడా కోయించి వీడ్కోలు చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 11 నే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు.

సంబంధిత సమాచారం :