“ఆదిపురుష్” ఓటిటి రిలీజ్ పై రావణ్ సాలిడ్ క్లారిటీ.!

Published on Sep 14, 2021 10:00 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ స్పాన్ ఉన్న పలు ప్రిస్టేజియస్ పాన్ ఇండియన్ చిత్రాల్లో దాదాపు ప్రభాస్ సినిమాలే ఎక్కువ ఉంటాయి. తాను పాన్ ఇండియన్ సినీమాల్లో నటించడం దగ్గర నుంచి తాను ఏ సినిమా చేస్తే అది పాన్ ఇండియన్ సినిమాగా మారే పరిస్థితి ఇప్పుడు. మరి అలా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస గాథ “ఆదిపురుష్” కూడా ఒకటి..

రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ పట్ల సైఫ్ అలీఖాన్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. బాలీవుడ్ వర్గాల్లో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆదిపురుష్ ఓటిటి రిలీజ్ పై మాట్లాడారు.

ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఓటిటి రిలీజ్ ఉండదని ఓంరౌత్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా సిల్వర్ స్క్రీన్ పై చూసే విధంగా తెరకెక్కిస్తున్నాడని తెలిపాడు. జస్ట్ చిన్న చిన్న స్క్రీన్స్ లో చూసే సినిమా అయితే ఇది కాదు ఈ సినిమాలో చాలా సాలిడ్ విజువల్స్ ఉన్నాయి వాటిని బిగ్ టికెట్ పై చూసి ఎంజాయ్ చెయ్యాలని సైఫ్ ఈ చిత్రంపై సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :