‘సైఫ్’ కోసం ఎదురుచూస్తున్న ఆ నాలుగు సినిమాలు !

‘సైఫ్’ కోసం ఎదురుచూస్తున్న ఆ నాలుగు సినిమాలు !

Published on Jan 20, 2025 11:37 PM IST

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడ్ని థానేలో ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. నిందితుడిని బాంద్రాలోని హాలిడే కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించడం జరిగింది. మరోవైపు సైఫ్‌ అలీఖాన్‌ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడాయన నెమ్మదిగా గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఐతే, సైఫ్‌ అలీఖాన్‌ రాక కోసం పలు చిత్రబృందాలు ఎదురుచూస్తున్నాయి.

సైఫ్‌ అలీఖాన్‌ చేతిలో ప్రస్తుతం నాలుగైదు చిత్రాలున్నాయి. గతేడాది ‘దేవర’తో విలన్ గా తెలుగు తెరకు పరిచమయ్యారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా రానున్న ‘దేవర 2’ ఉంది. రాబీ గ్రూవెల్‌ రూపొందిస్తున్న ‘జ్యువెల్‌ థీఫ్‌: ది రెడ్‌ సన్‌ ఛాప్టర్‌’ లోనూ సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. మార్ఫిక్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ‘పఠాన్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించనున్న చిత్రంలోనూ సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారు. అలాగే ‘భక్షక్‌’ ఫేమ్‌ దర్శకుడు పుల్కిత్‌ రూపొందించనున్న ‘కర్తవ్య’లో కూడా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. మొత్తానికి సైఫ్‌ అలీఖాన్‌ రాక కోసం ఈ నాలుగు చిత్రబృందాలు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు