‘శైలజా రెడ్డి అల్లుడు’ లేటెస్ట్ నైజాం కలెక్షన్స్ !

మారుతి దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలై ఏవరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా చైతు కెరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించే దిశగా వెళ్తుంది. కాగా నైజాంలో వారం ముగిసేసరికి ఈ చిత్రం టోటల్ గా మొత్తం రూ. 3.75 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది.

కాగా ఈ చిత్రం బి.సి సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భవితవ్యం ఈ శనిఆదివారం కలెక్ట్ చేసే కలెక్షన్స్ బట్టే తేలనుంది. మొత్తం మీద ‘ఇగో’ అనే చిన్న పాయింట్ తో మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రత్యేకించి ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రలో నటించడం విశేషం.

Exit mobile version