ఎన్టీఆర్ వాయిస్ తో మరింత ఇంట్రెస్టింగ్ గా “తేజ్15” టైటిల్ గ్లింప్స్.!

ఎన్టీఆర్ వాయిస్ తో మరింత ఇంట్రెస్టింగ్ గా “తేజ్15” టైటిల్ గ్లింప్స్.!

Published on Dec 7, 2022 11:07 AM IST

మెగా ఫామిలీ నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వినూత్న సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పలు ఎంటర్టైనింగ్ చిత్రాలు తర్వాత దేనికది కొత్త కాన్సెప్ట్ ని ఎంచుకుంటూ తన కెరీర్ లో 15వ సినిమాకి గాను సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరి గత కొన్ని రోజులు నుంచి అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మంచి హై అందుకున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని అయితే ఇప్పుడు మేకర్స్ రెవెల్క్ చేసారు. తెలియని నిజాన్ని చూపించే మరో నేత్రమే ఈ “విరూపాక్ష” అంటూ టైటిల్ ని రివీల్ చేశారు. అలాగే ఈ గ్లింప్స్ లో పలు విజువల్స్ కూడా మంచి ఆసక్తిగా ఉండడంతో ఆ వాయిస్ ఓవర్ తో మరింత ఎఫెక్టీవ్ గా ఈ వీడియో ఉంది.

ఇక లాస్ట్ లో సాయి తేజ్ తన ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడం విశేషం.. ఇంకా ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ ఆజనీస్ లోకనాథ్ ఇచ్చిన స్కోర్ కూడా బాగుంది. మరి ఓవరాల్ గా అయితే సాయి తేజ్ మంచి హిట్ అందుకునేలా ఉన్నాడనిపిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు