కన్ఫర్మ్ : “సలార్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Oct 4, 2023 8:01 am IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే “సలార్”. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ రీసెంట్ గానే డిసెంబర్ రిలీజ్ కి చేయగా ఇప్పుడు అంతా ఈ చిత్రం సెన్సేషనల్ ట్రైలర్ కట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ అవైటెడ్ ట్రైలర్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మంచి ఆసక్తిగా మారగా.

దీనితో సాలిడ్ అప్డేట్ తెలిసింది. దీంతో అయితే ఈ చిత్రం ట్రైలర్ ని మేకర్స్ ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ అక్టోబర్ 23 కి సిద్ధం చేస్తున్నారని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో అయితే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా తాలూకా ట్రైలర్ అయితే ప్రభాస్ బర్త్ డే కి బ్లాస్ట్ అవ్వనుంది అని చెప్పాలి. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు తమ బ్యానర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ని ఈ చిత్రానికి పెట్టి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :