‘సలార్ – 2’ : షూటింగ్ కి రెడీ అవుతున్న టీమ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ది రాజా సాబ్, కల్కి 2898 మూవీస్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే కల్కి ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది, అయినప్పటికీ కూడా బ్రేక్ తీసుకోని ప్రభాస్, అనంతరం మే నెలాఖరులో సలార్ 2 షూట్ లో పాల్గొననున్నారనేది లేటెస్ట్ అప్ డేట్. ఇక సలార్ 2 ని రామోజీ ఫిలిం సిటీ లో షూట్ ఆరంభించనున్నారట. ఇక ఫస్ట్ షెడ్యూల్ పది రోజుల పాటు ఉండనుండగా ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల పై కీలక సీన్స్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

అయితే ఫస్ట్ పార్ట్ కి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లో ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసినట్లు చెప్తున్నారు. ఇక ఈ సలార్ 2 మూవీ విషయమై అన్ని అనుకున్నట్లు జరిగితే 2025 డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది టీమ్ ప్లాన్ అట. ఇక ఈ మూవీని మరింత భారీ వ్యయంతో హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు.

Exit mobile version