తనను హత్య చేయాలనిపించేది – శ్రియారెడ్డి

తనను హత్య చేయాలనిపించేది – శ్రియారెడ్డి

Published on May 20, 2024 8:55 AM IST

‘సలార్’ సినిమాలో రాధా రమ పాత్రతో మళ్లీ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది నటి శ్రియా రెడ్డి. ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సలార్ సినిమాను చూసిన వారంతా తమిళ నటి శ్రియారెడ్డి పై ప్రశంసలు కురిపస్తున్నారు. మరోవైపు ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రియారెడ్డి సలార్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది.

శ్రియారెడ్డి మాట్లాడుతూ, “సలార్ షూటింగ్ సమయంలో నేను ప్రతిరోజూ ప్రశాంత్ నీల్‌ కి నా పాత్ర ప్రాధాన్యత విషయంలో ఒత్తిడి చేస్తూనే ఉండేదాన్ని. ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి, సలార్ కథనంలో నా పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉండాలని నేను ప్రశాంత్ నీల్‌ ని అడుగుతూ ఉండేదాన్ని’ అని చెప్పింది.

శ్రియారెడ్డి ఇంకా మాట్లాడుతూ, “సహజంగా పెద్ద సినిమాలో మనం భాగమైతే సంతృప్తిగా అనిపిస్తోంది. ఐతే, నేను సెట్స్‌ కి వెళ్లినప్పుడు, ఏ సమయంలో నేను ఏమి మాట్లాడాలో ? అని ముందే ప్రిపేర్ అయ్యేదాన్ని. కానీ, ప్రశాంత్ నీల్‌ కి సెట్స్‌లో డైలాగ్స్ రాసే అలవాటు ఉంది, తను అలా రాసినప్పుడల్లా తనిని (ముసిముసిగా నవ్వుతూ) హత్య చేయాలనిపించేది’ అని శ్రియారెడ్డి సరదాగా కామెంట్స్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు