“సలార్”.. డబ్బులు వెనక్కి?

Published on Sep 2, 2023 10:03 am IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి నిన్న సలార్ మంత్ మొదలు కావడంతోనే ఈ భారీ చిత్రం రిలీజ్ విషయంలో ఇంకా టెన్షన్ స్టార్ట్ అవ్వగా షాకింగ్ గా మరో అంశం సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అనే రూమర్స్ కూడా గట్టిగా స్టార్ట్ అయ్యాయి.

అయితే యూఎస్ లో ఇది వరకే బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమాకి కూడా రాని స్థాయి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు రిలీజ్ వాయిదా కావడంతో అక్కడ బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. దీనితో “సలార్” చిత్రం వాయిదా కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :