“సలార్” ఫ్రాంచైజ్ మరింత గ్రాండ్ గా.?

“సలార్” ఫ్రాంచైజ్ మరింత గ్రాండ్ గా.?

Published on Dec 24, 2022 3:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఆల్రడీ ఉండగా మేకర్స్ అయితే దాదాపు 80 శాతంకి పైగా షూట్ ని కంప్లీట్ చేసేసారు. ఇక ఈ చిత్రంపై అయితే గతంలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

కేజీయఫ్ తరహాలోనే సీక్వెల్ ఈ సినిమాకి కూడా ఉంటుంది అని గట్టి బజ్ రాగ ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి కూడా ఒక్క సీక్వెల్ మాత్రమే ఉందట డెఫినెట్ గా రెండు లేదా అంతకు మించే ఉండొచ్చని లేటెస్ట్ గా వచ్చిన టాక్. దీనితో అయితే ఈ చిత్రం రానున్న రోజుల్లో మరింత గ్రాండ్ గా మారిపోనుంది అని చెప్పాలి. మరి ఈ ఫ్రాంచైజ్ అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి సెన్సేషన్ ని రేపుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు