భారీ యాక్షన్ మోడ్ లో “సలార్”.!

భారీ యాక్షన్ మోడ్ లో “సలార్”.!

Published on Nov 19, 2022 9:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. మరి పాన్ ఇండియా వైడ్ అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూటింగ్ కూడా ఇప్పుడు మాస్ స్పీడ్ లో జరుగుతుంది. ఇక లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి భారీ సెట్ లో ఈ షూటింగ్ మేకర్స్ ప్లాన్ చెయ్యగా ఇందులో నీల్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారట. దీనితో ఈ టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. అసలే ప్రభాస్ లాంటి యాక్షన్ కటౌట్ కి నీల్ లాంటి దర్శకునితో సినిమా పడితే ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ అవైటెడ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వాలారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు