“సలార్” వర్కింగ్ స్టిల్ తో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలిపిన టీమ్!

“సలార్” వర్కింగ్ స్టిల్ తో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలిపిన టీమ్!

Published on Oct 23, 2022 5:35 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా సినీ వర్గాలు, మీడియా, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ కే నిర్మాతలు ఆయా చిత్రాల పోస్టర్లను విడుదల చేశారు.

ఇప్పుడు సలార్ మేకర్స్ ఈ చిత్రం నుండి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ సూపర్ గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ స్టైలిష్ మేకోవర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ రేంజ్ మెకోవర్ కి కారణమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి థాంక్స్ తెలిపుతున్నారు ఫ్యాన్స్. ఈ వర్కింగ్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ KGF సిరీస్‌ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు