పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా సినీ వర్గాలు, మీడియా, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ కే నిర్మాతలు ఆయా చిత్రాల పోస్టర్లను విడుదల చేశారు.
ఇప్పుడు సలార్ మేకర్స్ ఈ చిత్రం నుండి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రభాస్ సూపర్ గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ స్టైలిష్ మేకోవర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ రేంజ్ మెకోవర్ కి కారణమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి థాంక్స్ తెలిపుతున్నారు ఫ్యాన్స్. ఈ వర్కింగ్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ KGF సిరీస్‌ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.
The person who dreamt incomprehensibly big n transcended boundaries of language, culture n cinema to achieve a global appeal. To the man with an unparalleled following, wishing u long life n success.
To our Paramount ???? #Prabhas a very Happy B’day.#HappyBirthdayPrabhas #Salaar pic.twitter.com/O4s1XANjCi— Hombale Films (@hombalefilms) October 23, 2022