మాస్ “సలార్”..రిలీజ్ కి ముందే సెన్సేషన్.!

Published on Mar 2, 2023 1:31 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. మరి సినిమా అయితే అనౌన్స్ చేసినప్పుడే భారీ హైప్ ని నెలకొల్పగా ఈ సినిమా వస్తున్న ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సెన్సేషన్ గా మారుతుంది. మరి ఇదిలా ఉండగా ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా మూవీ లవర్స్ లో అదరగొడుతుంది.

గతంలో సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండగానే కేజీఎఫ్ 2 బుక్ మై షో లో లక్ష కి పైగా ఇంట్రెస్ట్స్ ని సంపాదించుకుందో ఇప్పుడు అదే విధంగా సలార్ పై కూడా లక్షకి పైగా ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీనితో అయితే ఈ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె పార్ట్ ఈ మధ్యనే కంప్లీట్ చేసుకుంది. అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమా ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :