“సలార్” ని వేరే లెవెల్లో కంప్లీట్ చేస్తున్నారుగా!

Published on Sep 15, 2021 11:00 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కూడా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఇటీవలే ఒక భారీ ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ ని నీల్ స్టార్ట్ చేశాడన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి మూడో షెడ్యూల్ గా ఇది స్టార్ట్ అయ్యింది. మరి ఈ షెడ్యూల్ ని కూడా మేకర్స్ ఆల్రెడీ నిన్నటితో కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ సినిమాని మాత్రం ప్రశాంత్ నీల్ సమయం దొరికినప్పుడల్లా ఎక్కడా లేట్ చెయ్యకుండా చాలా త్వరగానే ఫినిష్ చేసేస్తున్నాడని చెప్పాలి.

ఇది వరకు పలు కారణాల చేత గ్యాప్ వచ్చినా ఈసారి మాత్రం ఉన్న సమయాన్ని వృధా చెయ్యకుండా వేరే లెవెల్లో కంప్లీట్ చేసేస్తున్నాడు.. ఇదే కంటిన్యూ అయితే ఈ ఏడాది చివరికి దాదాపు సినిమా కంప్లీట్ అయ్యిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :