జపాన్ బాక్సాఫీస్ వద్ద “సలార్” దూకుడు!

జపాన్ బాక్సాఫీస్ వద్ద “సలార్” దూకుడు!

Published on Jul 10, 2024 12:31 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇటీవల జపాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. మొదటి వీకెండ్ కి గానూ 18.2 మిలియన్ యెన్ లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

మొదటి వీకెండ్ ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ (44 మిలియన్ల యెన్ లతో) మొదటి స్థానంలో, సాహో (23 మిలియన్ల యెన్ లతో) రెండో స్థానం లో ఉండగా, ఇప్పుడు సలార్ మూడో స్థానంలో నిలిచింది. లాంగ్ రన్ లో అక్కడ మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరొక పక్క ప్రభాస్ నటించిన కల్కి చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు