యంగ్ డీవోపీ కి ‘సలార్’ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

యంగ్ డీవోపీ కి ‘సలార్’ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Published on Dec 22, 2022 11:00 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కెజిఎఫ్ సిరీస్ మూవీస్ దర్శకడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ సలార్. ప్రభాస్ ఈ మూవీలో మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా కనిపించనుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్, ఈశ్వరిరావు, జగపతిబాబు వంటి వారు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సలార్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా డీవోపీ గా భువన్ గౌడ వర్క్ చేస్తున్నారు. కాగా నేడు బర్త్ డే జరుపుకుంటున్న తమ మూవీ యొక్క యంగ్ అండ్ డైనమిక్ డీవోపీ భువన్ గౌడ కి కొద్దిసేపటి క్రితం సలార్ మూవీ టీమ్ ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసింది. కాగా సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 న భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు