ఇంట్రెస్టింగ్..”సలార్” టాక్ వస్తే ఇక సునామీనే..!

ఇంట్రెస్టింగ్..”సలార్” టాక్ వస్తే ఇక సునామీనే..!

Published on Oct 29, 2022 6:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కేజీయఫ్ ని మించి భారీ హైప్ ని అయితే సెట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ప్రభాస్ కూడా చురుగ్గా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా మళ్ళీ సలార్ పేరు అయితే హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ నటిస్తున్నటువంటి భారీ చిత్రం “ఫైటర్” రిలీజ్ కూడా సలార్ తోనే ఉండొచ్చని ఆ మధ్య బాలీవుడ్ లో టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఫైటర్ అయితే 2024కి షిఫ్ట్ కావడంతో వచ్చే ఏడాది అక్టోబర్ లో సలార్ కి సోలో రిలీజ్ వచ్చింది. ఇక అక్కడ జస్ట్ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే డెఫినెట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో మళ్ళీ ప్రభాస్ వసూళ్ల సునామి సృష్టించడం గ్యారెంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు