“సలార్” పై హైప్ మరింత పెంచిన నిర్మాత.!

“సలార్” పై హైప్ మరింత పెంచిన నిర్మాత.!

Published on Dec 24, 2022 10:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ ఉన్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు కన్నడ సెన్సేషన్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో చేస్తున్న “సలార్” చిత్రమే అని చెప్పాలి. మరి ఈ చిత్రంతో అయితే మేకర్స్ జస్ట్ అనౌన్సమెంట్ తోనే రికార్డు మార్క్ ఓటిటి ఆఫర్స్ కూడా సొంతం చేసుకున్నారు.

ఇక ఈ చిత్రం ని కన్నడ బిగ్గెస్ట్ హిట్ చిత్రం కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు తెరకెక్కిస్తుండగా ఈ సంస్థ అధినేత విజయ్ కిరగందుర్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ సాలిడ్ హైప్ ని అందించినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం అనుకున్నట్టే బాగా వస్తుంది అని ఆల్రెడీ అయితే 80 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోగా నెక్స్ట్ ఏడాది అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు.

అలాగే ఈ సినిమా డెఫినెట్ గా తమ నుంచి వచ్చిన అన్ని సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసే లెవెల్లో ఉంటుందని తెలపడం మరింత కేజ్రీగా మారింది. అంటే వారి నుంచి వచ్చిన బిగ్గెస్ట్ గ్రాసర్ కేజీయఫ్ 2 ని కూడా ఈ చిత్రం మించేలా ఉంటుంది అని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా నటుడు పృథ్వీ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు