‘సలార్’ : అప్పటివరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదా ?

‘సలార్’ : అప్పటివరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదా ?

Published on Sep 16, 2023 1:30 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా మాస్ యాక్షన్ మూవీ సలార్ పై అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా రోజు రోజుకి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీగా హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న సలార్ కి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కనిపించనున్నారు.

అయితే తమ సినిమా రిలీజ్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు ఇటీవల సలార్ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రస్తుతం సలార్ కి సంబంధించి కొంత విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోందని, అది పూర్తి అయిన తరువాతనే రిలీజ్ డేట్ పై ప్రకటన చేయాలని యూనిట్ ఆలోచన చేస్తోందట. దీనిని బట్టి సలార్ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు