‘సలార్-2’ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తి !

సలార్-2

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఐతే, ఈ సినిమా థియేటర్లలో విడుదలై, ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రంగా నిలిచి నేటికి రెండేళ్లు పూర్తయింది. దీంతో, అభిమానులు ఈ సినిమా గురించి చర్చ మొదలు పెట్టారు. ఈ సినిమా విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ‘సలార్ 2’ పై ఆసక్తి మళ్లీ పెరిగింది. అభిమానులు ఈ సీక్వెల్‌ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు, కానీ నిర్మాతలు మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు.

ఐతే, ఆ మధ్య ‘సలార్-2 గురించి ప్రభాస్ ఫ్యాన్స్‌కు దర్శకుడు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ‘సలార్-2 సినిమాని నా అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ సినిమా స్క్రిప్ట్ బహుశా ఇప్పటి వరకూ నా అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ‘సలార్ 2 సినిమా విషయంలో ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఆ మూవీని తీస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సీక్వెల్‌లో శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు శ్రియా రెడ్డి నటిస్తున్నారు.

Exit mobile version