ఆర్ ఆర్ ఆర్ మూవీ పై వైరల్ అవుతోన్న సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు

Published on Dec 19, 2021 11:31 pm IST


రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలు గా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ముంబై లో జరగడం విశేషం. ఈ వేడుక కి సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ముఖ్య అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన నాలుగు నెలల వరకు ఏ ఇండియా ఫిల్మ్ ను రిలీజ్ చేయడానికి సాహసించకండి అని వ్యాఖ్యానించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి వ్యాఖ్యాత గా వ్యవహరించగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటుగా అలియా భట్, శ్రియ శరణ్ లు వేడుక కి హాజరు అయ్యారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ శరణ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :