బ్రేకప్‌ ల విషయంలో తప్పు నాదే – సల్మాన్ ఖాన్

Published on May 1, 2023 9:00 am IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జీవితంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి. తాజాగా సల్మాన్ తన ప్రేమ కథలన్నీ తనతోనే సమాధి అవుతాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మీ ప్రేమ కథలతో జీవిత చరిత్ర రాయాలని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన గర్ల్‌ఫ్రెండ్స్ అందరూ మంచివారేనని… బ్రేకప్‌ల విషయంలో తప్పు తన వైపే ఉందని సల్మాన్ చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో అభద్రతతో జీవించడం కంటే భద్రత మధ్య జీవించడం ఉత్తమమని సల్మాన్ చెప్పడం విశేషం.

అన్నట్టు తనకు పిల్లలంటే చాలా ఇష్టమని సల్మాన్ ఖాన్ వెల్లడించడం మరో విశేషం. అదే ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘నేను పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు. కానీ భార్య లేకుండా నాకు తండ్రి కావాలని ఉంది. ఇందుకు భారతీయ చట్టాలు అంగీకరించవు. సరోగసీ ద్వారా కరణ్ జోహర్ ఇద్దరు పిల్లలను పొందారు. ఇక్కడి చట్టం మారుతుందేమో చూడాలి’ అని సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సంబంధిత సమాచారం :