గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ తో సల్మాన్ ఖాన్!

Published on Aug 24, 2021 2:36 pm IST

మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజున వరుస సినిమాలని ప్రకటించడం జరిగింది. అందులో లూసీఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టైటిల్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఇందులో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇందుకు సంబంధించిన మరొక వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ చిత్రం కోసం డేట్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కీలక పాత్ర లో సల్మాన్ నటించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :