టాలీవుడ్ మెగా జంటతో బాలీవుడ్ కండల వీరుడు…వైరల్ అవుతోన్న ఫోటో!

Published on Jun 26, 2022 9:02 pm IST


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి కబీ ఈద్ కబీ దీపావళి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పాన్ ఇండియన్ నటి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ఇందులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపిస్తారని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా మెగా జంట రామ్ చరణ్, ఉపాసన కొణిదెలను సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్ ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలవడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో సేపటికే వైరల్‌గా మారింది. వర్క్ ఫ్రంట్‌లో, రామ్ చరణ్ తదుపరి పొలిటికల్ థ్రిల్లర్‌లో కనిపించనున్నాడు, దీనికి తాత్కాలికంగా RC 15 అని పేరు పెట్టారు, దీనికి ప్రముఖ దర్శకుడు శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :