పోకిరి2 కి సిద్దమవుతున్న స్టార్ హీరో…?

salmankhan2

పూరి జగన్నాధ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ చిత్రం పలు భాషలలో రీమేక్ చేయబడింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ హిందీలో వాంటెడ్ పేరుతో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. దర్శకుడు ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సల్మాన్ అపజయాలకు అడ్డుకట్టవేసి ఆయనను విజయాల బాట పట్టించింది. కాగా సల్మాన్ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసే యోచనలో ఉన్నారని సమాచారం.

ప్రతి రంజాన్ కి ఒక చిత్రం ఖచ్చితంగా విడుదల చేశే సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది ఇన్షాల్లా అనే చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాల్సిన ఆ మూవీ కొన్ని కారణాల వలన సెట్స్ పైకెళ్ళకుండానే రద్దైంది. దీనితో సల్మాన్ వాంటెడ్2 మూవీ చేయాలని ప్రణాళిక వేస్తున్నారని తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ బాలీవుడ్ వర్గాలలో ప్రముఖంగా వినిపిస్తుంది.

Exit mobile version