సినిమాలపై చిరంజీవి గారికి వున్న ప్రేమ వల్లనే గాడ్ ఫాదర్ చేశా – హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్

Published on Oct 2, 2022 2:00 am IST

మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం మోహన్ రాజా తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ గాడ్ ఫాదర్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకోగా మూవీని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు మేకర్స్. ఇక ఈ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ యొక్క హిందీ వర్షన్ ట్రైలర్ ని నేడు ముంబైలో ఒక స్పెషల్ ఈవెంట్ లో భాగంగా విడుదల చేసారు.

ఈ మూవీలో ఒక సర్ప్రైజింగ్ రోల్ చేస్తున్న సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి సహా మరికొందరు గాడ్ ఫాదర్ యూనిట్ పాల్గొన్న ఈ ఈవెంట్ లో రిలీజ్ అయిన హిందీ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, సినిమాల మీద మాకు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న ప్రేమ వల్లనే గాడ్ ఫాదర్ మూవీలో వర్క్ చేసాను, ఇక డైరెక్టర్ సహా యూనిట్ మొత్తం కూడా షూట్ టైం లో ఎంతో సహకరించారు. ఇక మెగాస్టార్ తో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం, అలానే నేను మల్టీస్టారర్లు చేయడానికి ఎప్పుడూ సిద్దమే అన్నారు. ఈ విధమైన సినిమాలు చేయడం వలన ఆడియన్స్ అందరికీ మరింతగా రీచ్ అవడంతో పాటు కలెక్షన్ కూడా బాగా వస్తుందని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఈ గాడ్ ఫాదర్ మూవీలో ఒక పాత్ర ఉంది మీరు చేయాలి అని నేను సల్మాన్ ని అడగగానే ఏ మాత్రం సంకోచించకుండా మీరు అడిగారు నేను తప్పకుండా చేస్తాను అంటూ వర్క్ చేసిన సల్మాన్ ఖాన్ ని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్. సత్యదేవ్ మాట్లాడుతూ, అన్నయ్య మెగాస్టార్ తో అలానే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారితో వర్క్ చేయడం మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ అని, ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారని, అలానే మూవీలో తన పాత్ర ఆడియన్స్ కి మరింతగా చేరువ చేస్తుందని అన్నారు. మొత్తంగా నేడు జరిగిన గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ మూవీని మరింత మందికి చేరువ చేసింది అనే చెప్పాలి. అక్టోబర్ 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :