హైదరాబాద్‌లో సల్మాన్‌ సందడి.. బిర్యానీ టేస్ట్ చేశాడట..!

Published on Dec 2, 2021 12:54 am IST


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హైదరాబాద్‌లో సందడి చేశాడు. ఆయుశ్‌ శర్మ ముఖ్యపాత్రలో మహేశ్‌ ముంజ్రేకర్‌ దర్శకత్వంలో ‘అంతిమ్‌’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. నవంబర్‌ 26న ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ జరిగింది.

ఈ కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్‌, ఆయుష్‌ శర్మ, డైరెక్టర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ “హైదరాబాద్‌ నాకు ఇష్టమైన ప్రదేశం అని, హైదరాబాద్‌ రాగానే బిరియానీ రుచి చూశా. ‘అంతిమ్‌’ అందరినీ మెప్పిస్తోంది. మళ్లీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అభిమానులను కలుస్తానని సల్మాన్‌ అన్నాడు.

సంబంధిత సమాచారం :