సమంత కల త్వరలోనే నెరవేరబోతుందా?

Published on Aug 18, 2021 2:28 am IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంతకు ఉన్న ఓ కల తొందరలోనే నెరవేరబోతున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా సమంత గోవాలో ఓ మంచి ప్లేస్ కొనుక్కోవాలని చూస్తుందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఓ అప్డేట్ బయటకొచ్చింది. చైతు-సామ్ జంట గోవాలో ఓ మంచి స్పాట్‌ను కనుగొన్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తుంది.

అయితే త్వరలోనే ఈ జంట ఆ ప్లేస్‌లో ఫామ్‌హౌస్‌ను నిర్మించుకోబోతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చై-సామ్ జంటకు గోవాలోనే వివాహం జరగడంతో ఈ జంటకు ఇది స్పెషల్ ప్లేస్ అని చెప్పాలి. అంతేకాకుండా సమంత అనేక ఇంటర్వ్యూలలో తాను గోవాలో నివసించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఏదేమైనా సమంత కల త్వరలోనే నెరవేరేలా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :