సామ్ “యశోద” ప్రస్తుత పరిస్థితి ఇది.!

సామ్ “యశోద” ప్రస్తుత పరిస్థితి ఇది.!

Published on Nov 16, 2022 7:05 AM IST

సమంత మెయిన్ లీడ్ లో చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఒకటైన పాన్ ఇండియా చిత్రం “యశోద” రీసెంట్ గా రిలీజ్ అయ్యే హిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి సామ్ కెరీర్లో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోడమే కాకుండా మంచి ఓపెనింగ్స్ కూడా సాధించింది. అయితే ఈ చిత్రం వారాంతం వరకు మన తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ అక్యుపెన్సీ తో ఆదరగొట్టగా ఇప్పుడు పరిస్థితి మారినట్లు గా తెలుస్తోంది.

ఈ సోమవారం నుంచి అయితే యశోద బాగా డ్రాప్ అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాలు చెవుతున్నాయి. అంటే మొదటి మూడు రోజుల వసూళ్లతో పోలిస్తే 4, 5 రోజుల్లో యశోద డల్ అయ్యినట్టే తెలుస్తోంది. మరి మళ్లీ ఇది పుంజుకుంటుందో లేదో చూడాలి. ఆల్రెడీ అయితే ఆల్ మోస్ట్ సినిమా లాభాల దగ్గరలోనే ఉంది. మరి ఫైనల్ రన్ లో ఎంత వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని అయితే హరి అండ్ హరీష్ లు దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు