టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “సామజవరగమనా”

Published on Sep 17, 2023 3:01 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సామజవరగమనా. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం కానుంది. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ పతాకాల పై నిర్మించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :