మరో ఫీట్ సాధించిన “సామజవరగమన” సాంగ్..!

Published on Oct 10, 2021 12:08 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూనే వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు మాత్రం ముందు నుంచి సెన్సేషన్‌ని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని “సామజవరగమన” సాంగ్ యూట్యూబ్‌లో మరో ఫీట్ సాధించింది.

ఈ పాట యూట్యూబ్‌లో 200 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతూ సత్తా చాటుతుంది. అయితే ఈ పాటకు సిరివెన్నెల లిరిక్స్ అందించగా, అద్భుతమైన మ్యూజిక్ అందించి తమన్ మాయాజాలం చేయడంతో ఇప్పటికీ మ్యూజిక్ ప్రియులను ఈ పాట అలరిస్తూనే ఉంది.

సంబంధిత సమాచారం :