త్వరలోనే శుభవార్త చెప్పనున్న సమంత !

samantha
స్టార్ హీరోయిన్ సమంత ఈ సంవత్సరం తెలుగులో ‘బ్రహ్మోత్సవం, అ..ఆ, జనతా గ్యారేజ్’ వంటి మూడు పెద్ద ప్రాజెక్టులు చేసినప్పటికీ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ తరువాత వేరే ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు. దీంతో అందరూ అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి కుదరడం వల్లనే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంలేదని అన్నారు. కానీ సమంత మాత్రం మంచి ప్రాజెక్ట్స్ దొరక్కపోవడం వల్లనే కొత్త సినిమాలకు సైన్ చేయలేదని, దానికి పెళ్ళికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

దీంతో సమంత అభిమానులంతా సమంతకు త్వరగా మంచి ప్రాజెక్టులు దొరకాలని, ఆ సినిమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తై థియేటర్లలోకి రావాలని కోరుకున్నారు. ప్రస్తుతం సమంత చెప్పిన వార్త చూస్తే వాళ్ళ కోరిక ఫలించేలా ఉంది. తనకు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ దొరికాయని, వాటిని అనౌన్స్ చేయడానికి చాలా ఆతురతగా ఉన్నానని, అవి కూడా తెలుగులోనే అని ట్విట్టర్ ద్వారా సమంత తెలిపారు. ఇక సమంత చేస్తున్న ఆ ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఏ హీరోలతో, ఏ డైరెక్టర్స్ తో అనేది ఆమె నోటి వెంటే వినాలి మరి.