మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డితో చేసిన హ్యాట్రిక్ సినిమానే ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ సమంత కెరీర్ లోనే రికార్డు హిట్ గా నిలిచింది. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్స్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే థియేటర్స్ లో ఇప్పటికీ ర్యాంపేజ్ కొనసాగించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.
ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ జూలై 17 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే ఓటిటిలో మిస్సవ్వకుండా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథా సహకారం అందించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలాగే సమంత నిర్మాణం వహించింది.
July 17th
Okokkodni kodathamu chudu… Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026
