స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం ఫేమస్ కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ కోసం షూట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు, సోషల్ మీడియాలో ఒక విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంతా మొదటిసారి ఈ షోలో చై నుండి విడాకుల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
చై మరియు సామ్ ఇద్దరూ ఇప్పటి వరకు బహిరంగ వేదికపై దాని గురించి మాట్లాడలేదు. ఆ ప్రశ్నను సామ్ చాలా డిగ్నిఫైడ్ గా హ్యాండిల్ చేసిందనేది గాసిప్. సరే, ఫైనల్ ఎడిట్‌లో ఈ బిట్ జోడించబడుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ అంశం అందరిలో ఆసక్తిని రేపుతోంది. జూలైలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ ప్రసారం కానుంది.