నన్ను ఒంటరిగా వదిలేయండి…విడాకుల పై సమంత కీలక వ్యాఖ్యలు!

Published on Oct 8, 2021 7:30 pm IST


అక్కినేని నాగ చైతన్య మరియు సమంత లు విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం పట్ల ఇద్దరు కూడా సహకరించాలి అంటూ తమ అభిమానులను, శ్రేయోభిలాషులను, మీడియా ను విజ్ఞప్తి చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల కారణం గా నేడు సమంత మరొకసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మీరు నా పై చూపిస్తున్న సానుభూతి నన్ను ముంచెత్తింది. అందరికీ ధన్యవాదాలు. అయితే కొందరు మాత్రం తన పై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అఫైర్స్ ఉన్నాయి అని, పిల్లల్ని వొద్దు అనుకున్నట్లు గా, అబార్షన్ చేయించుకున్నట్లు గా, అంతేకాక అవకాశ వాదినని ఇలా చెప్పుకొస్తున్నారు అంటూ తెలపడం జరిగింది. విడాకుల అంశం అనేది ఎంతో బాధతో కూడుకున్నది అంటూ తెలిపారు. ఒంటరిగా వదిలేయండి, వ్యక్తిగతం గా ఇలా దాడి చేయడం దారుణం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అలా ఎన్నడూ చేయను అని అన్నారు. సమంత చేసిన వ్యాఖ్యల కి గానూ అభిమానులు, నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :