టీనేజర్లకు సమంత సలహా..!

samantha

తన అందంతో, నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న సమంత టీనేజర్లకు బ్యూటీ టిప్స్ ఇస్తుంది. టీనేజ్ లో అమ్మాయిలకు, అబ్బాయిలకు పింపుల్స్(మొటిమలు) రావడం సహజం. ఇవి రాగానే చాలా మంది కంగారు పడుతుంటారు. అయితే ‘అజిఫాస్ట్ జెల్’ వాడితే పింపుల్స్(మొటిమలు) ఒక్క రోజులో మాయమవుతాయని సమంత ట్విట్టర్లో సెలవిచ్చింది. నా టీనేజ్ అభిమానుల కోసం అంటూ స్పెషల్ గా చెప్పింది. ఇంకెందుకు ఆలస్యం అందరూ ఫాలో అయిపోండి.

‘అల్లుడు శీను’ విజయంతో జోష్ మీదున్న సమంత నటించిన తాజా సినిమా ‘సికిందర్’ ఈ నెల 15న విడుదలవుతుంది. తర్వాత ఆగస్ట్ 29న ఎన్టీఆర్ ‘రభస’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రెండు సినిమాలలో సమంత అందాల ప్రదర్శన విషయంలో రేచ్చిపోయిందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, సాంగ్ ప్రోమోలు, స్టిల్స్ సమంతలో మాస్ యాంగిల్ ను బయటపెట్టాయి. ఇతర హీరోయిన్ల ధాటి నుండి తట్టుకోవాలంటే ఆ మాత్రం గ్లామర్ చూపించక తప్పదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version