అన్నపూర్ణ స్టూడియోస్ లోకి అడుగు పెట్టిన సమంత

అన్నపూర్ణ స్టూడియోస్ లోకి అడుగు పెట్టిన సమంత

Published on Nov 25, 2021 4:44 PM IST


సమంత విడాకులు తీసుకున్న అనంతరం వరుస ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది.

సమంత తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్ పోషిస్తున్న సమంత ఈ చిత్రం తనకు కీలకం కానుంది. ఈ చిత్రం తో పాటుగా సమంత నయనతార తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించనుంది. ఈ వరుస ప్రాజెక్ట్స్ తో గతం లో కంటే ఎక్కువ బిజిగా సమంత ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు