అక్కినేని కుటుంబానికి బాగా దగ్గరైపోయిన సమంత!

11th, September 2016 - 04:11:22 PM

samantha-amala
ప్రస్తుతం సౌతిండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోన్న సమంత, అక్కినేని ఫ్యామిలీ స్టార్ హీరో నాగ చైతన్యతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున కూడా ఈ విషయాన్నే తెలియజేస్తూ త్వరలోనే సమంత తమ ఇంటి వ్యక్తి కానుందని ఓ ప్రైవేటు వేడుకలో ప్రకటించేశారు. ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య, సమంతల పెళ్ళి ఇప్పుడే జరిగే సూచనలు లేకపోయినా, సమంత ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో ఓ మెంబర్‌గా కలిసిపోయారు.

అక్కినేని కుటుంబంతోనే కలిసి సమంత పార్టీలకు, వివాహ వేడుకలకు హాజరవుతున్నారు. ఇక అదేవిధంగా నాగార్జున భార్య అమల, కుమారుడు అఖిల్‌లతో కూడా సమంత బాగా కలిసిపోయారు. హైద్రాబాద్‌లో ఉన్నపుడు సమంత ఎక్కువగా నాగార్జున కుటుంబ సభ్యులతోనే గడుపుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతానికి చైతన్య, సమంత.. ఇద్దరూ ఎవరికి వారే తమ కెరీర్లో బిజీగా ఉండడంతో మరి కొద్దికాలం తర్వాతే పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారట.