తన 12ఏళ్ల సినీ ప్రయాణంపై సమంతా ఎమోషనల్ పోస్ట్.!

Published on Feb 26, 2022 12:01 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో సమంతా కూడా ఒకరు. తన కెరీర్ ఆరంభంలో ఓ చిన్న హీరోయిన్ గా చిన్న సినిమాలు నుంచే స్టార్ట్ అయినా ఇప్పుడు తన సినిమాలకి అంటూ ప్రత్యేక మార్కెట్ ని ఏర్పర్చుకున్న స్థాయికి చేరుకొంది. మరి తన కెరీర్ ని మొదలు పెట్టి నేటితో 12 పూర్తి చేసుకోవడంతో తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని ఆమె పెట్టింది.

“ఈరోజుతో నా సినీ ప్రయాణం 12 ఏళ్ళకి చేరుకుంది. లైట్స్, కేమెరా, యాక్షన్ అనే మూడు మార్చలేని పదాలతో ఇప్పుడు వరకూ చేరుకున్నాను.. ఈ ప్రయాణంలో అందరికీ ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానని ముఖ్యంగా నాకు విధేయతతో కలిగి ఉన్న ఫ్యాన్స్ కి ఎంతో ఋణపడి ఉన్నాననీ” సమంతా ఒక ఎమోషనల్ పోస్ట్ ని చేసి తెలియజేసింది. మరి ప్రస్తుతం అయితే సామ్ అనేక భాషల్లో పలు భారీ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. అలాగే రీసెంట్ గా వచ్చిన తన “శాకుంతలం” ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం :