సామ్-చైతూ విడాకులపై సామ్ ఫాదర్ ఏమన్నాడంటే?

Published on Oct 5, 2021 12:59 am IST

నాగచైతన్య-సమంత విషయంలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలే నిజం చేస్తూ మొన్న చైతూ-సమంత విడిపోతున్నట్టు అధికారికంగా చెప్పుకున్నారు. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఏమై ఉంటుందనేది మాత్రం ఇంతవరకు బయటకు అయితే తెలీదు. ఇదిలా ఉంటే తాజాగా సామ్-చైతూ విడాకులపై సమంత ఫాదర్ జోసెఫ్ ప్రభు స్పందించారు. ఈ విషయం తెలిసినపట్టి నుంచి తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని అన్నారు. సమంతకు అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని తాను భావిస్తున్నానని, త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని జోసెఫ్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే మొన్న వీరి విడాకులపై అక్కినేని నాగార్జున కూడా స్పందిస్తూ చైతూ, సమంత విషయంలో ఏదైతో జరిగిందో చాలా దురదృష్టకరమని అన్నారు. భార్య భర్తల మధ్య ఏది జరిగినా అది వారి వ్యక్తిగత విషయమని, సమంతతో గడిపిన క్షణాలను మా కుటుంబానికి ఎంతో మధురమైనవని, ఆమె ఎప్పటికీ మాకు ప్రియమైన వ్యక్తే అని, ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :