సమంత ప్రత్యేక గీతం వెనుక జరిగింది ఇదే !

Published on Dec 19, 2021 9:30 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. అయితే, ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం ప్రేక్షకులను బాగా అలరించింది. కాగా సుకుమార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ సాంగ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘నేను ఈ సాంగ్ గురించి చెప్పగానే సమంత నాకు కరెక్ట్‌ కాదండి అని చెప్పింది.

అయితే, నేను మాత్రం ఇది మీకు సరిపోతుంది. ఒక నటిగా మీకూ ఈ పాట కొత్తగా ఉంటుందని చెప్పాను. అప్పటికీ సామ్‌ వద్దనే చెప్పింది. అయితే, ఆ తర్వాత నా మాట పై, నా పై నమ్మకంతో ఈ పాట చేసింది. ప్రస్తుతం ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది’ అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇక ‘పుష్ప 2’ చిత్రీకరణను ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తారట. వచ్చే దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :