వైరల్ : చరణ్ కి ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ఇచ్చిన సమంతా.!

Published on Jul 22, 2022 10:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్ అయినటువంటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైనమిక్ హీరోయిన్ సమంతా లు తమ భారీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబోలో ఓ భారీ హిట్ “రంగస్థలం” అనే సినిమా కూడా వచ్చింది. మరి ఇపుడు అయితే ఈ ఇద్దరు కూడా ఎవరు వారి సినిమాల్లో బిజీగా ఉండగా లేటెస్ట్ గా సమంతా ఓ పాపులర్ షో అయినటువంటి కాఫీ విత్ కరణ్ లో పాల్గొనగా..

రామ్ చరణ్ కి ఒక ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ని ఇవ్వడం ఆసక్తిగా మారింది. కొన్ని ప్రశ్నల్లో చరణ్ కోసం ఒక్క మాటలో చెప్పాలని అడగ్గా ఓ జి అంటూ చెప్పింది. అయితే ఈ ఓ జి అంటే చరణ్ ఒక ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ అదిరే ట్యాగ్ ని చెప్పింది. దీనితో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మంచి వైరల్ గా మారింది. మరి ప్రస్తుతం చరణ్ అయితే శంకర్ బిజీగా ఉండగా సమంతా పలు టాలీవుడ్ సహా ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :